శ్రి పన్నగాద్రి వరశిఖరగ్ర వాసునకు
ఫపాంధకార ఘన భాస్కరునకు
ఆపరత్మునకు నిత్యాన్నపాలిని ఐన
మా పాలి అలమేలు మంగమ్మకు
జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
శరణన్న దాసులకు వరమిత్తునని
బిరుదు ధరియించియున్న పరదైవమునకు
మరువలదీబిరుదు నిరతమని పతిని
యేమరనీయనలమేలు మంగమ్మకు
అనంద నిలయమందనిశెంబు వసియించి
దీనులను రక్షించు దేవునకును
కానుకలనొనగూర్చి ఘనముగ విభుని
సన్మానించు అలమేలు మంగమ్మకు
పరమొసగ నావంతు నరులకని వైకుంట-
మరచెత చూపు జగదాత్మునకును
సిరులొసగ తనవంతు సిద్ధమని నాయకుని
ఉరముపై కొలువున్న శెరధి సుథకు
తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష
నలిఖించి గైకొనెడి అచ్యుతునకు
ఎలమి పాకంబు చెయించి అందరుకన్న
మలయకెపుడొసగె మహా మాతకు
మరియు చిత్ర విచిత్ర మంతపవళులకును
తిరువీధులకు దివ్య తీర్థములకు
పరగ ఘన గోపుర ప్రకర తతులకును
చిరములై తగు కనక శిఖరములకు
తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప
భరిత శ్రుంగర వన పంక్తులకును
మురువొంపు ఉగ్రాణములకు బొక్కసములకు
సరసంబులకు పాకశాలలకును
అహివైరి ముఖ్యమవహనములకు గొడుగులకు
రహినొప్పు మకర తోరనములకును
బహువిధద్వజములకు పటువాద్య వితతులకు
విహిత సత్కల్యాన వేదికలకు
ధరచక్ర ముఖ్యసాధనములకు మణిమయా-
భరణ దివ్యాంబర ప్రతతులకును
కరచరణ ముఖ్యాంగ గణసహితమై
శుభంకరమైన దివ్య మంగళమూర్థికి
కలిత సుగ్న్యానాది కళ్యన గుణములకు
బలమొప్పు నమితత్ప్రభావమునకు
బలగొనిన సకలపరివర దేవతలకును
చెలగి పనులొనరించు సేవకులకు
అలరగా బ్రహ్మొత్సవాదులై సంతతము
వలనొప్పు నిత్యొత్సవంబులకును
పొలుపొందు విశ్వ ప్రభుత్వమూలంబులకు
నలువొందు వర విమానంబులకును
అరయ తరిగొండ నరహరి అగచు నందరికి
వరములొసగె శ్రీనివాసునకును
మురియుచును విశ్వతొన్ముఖునిట్లు భరియించి
సిరుల మెరయుచునుండు శెషాద్రికి
జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
Sri Pannagadri varasikharagra vasunaku
Papandhakara ghana Bhaskarunaku
aa parathmunakunu nityannapalini aina
maa pali Alamelu mangammaku
Jayamangalam Nitya Subhamangalam
Jayamangalam Nitya Subhamangalam
Sarananna dasulaku varamitthunani
birudu dhariyinchiyunna paradaivamunaku
Maruvaladeebirudu nirathamani pathini
yemaraneeyanalamelu mangammaku
ananda nilayamandanisembu vaseinchi
deenulanu rakshinchu devunakunu
kanukalanonagurchi ghanamuga vibhuni
sanmaninchu alamelu mangammaku
paramosaga naavanthu narulakani vaikunTa-
marachetha choopu jagadathmunakunu
sirulosaga thanavanthu siddhamani nayakuni
uramupai koluvunna seradhi suthaku
thelivitho mudupulitu themmu themmani parusha
nalikhinchi gaikonedi achyuthunaku
elami pakambu cheyinchi andarukanna
malayakepudosage maha maathaku
mariyu chithra vichithra mantapavalulakunu
thiruveedhulaku divya theerthamulaku
paraga ghana gopura prakara thathulakunu
chiramulai thagu kanaka sikharamulaku
tharchaina dharmasatramulakunu phalapushpa
bharitha srungara vana pankthulakunu
muruvompu ugranamulaku bokkasamulaku
sarasambulaku pakasalalakunu
ahivairi mukhyamavahanamulaku godugulaku
rahinoppu makara thoranamulakunu
bahuvidhadwajamulaku patuvadya vithathulaku
vihitha sathkalyana vedikalaku
dharachakra mukhyasadhanamulaku manimaya-
bharana divyambara prathathulakunu
karacharana mukhyanga ganasahithamai
subhankaramaina divya mangalamurthiki
kalitha sugnyanadi kalyana gunamulaku
balamoppu namithathprabhavamunaku
balagonina sakalaparivaradevathalakunu
chelagi panulonarinchu sevakulaku
alaraga brahmotsavadulai santhathamu
valanoppu nityotsavambulakunu
Polupondu viswaprabhuthvamoolambulaku
naluvondu varavimanambulakunu
araya THARIGONDA NARAHARI agachu nandariki
varamulosage SREENIVASUNAKUNU
muriyuchunu viswathonmukhunitlu bhariyinchi
sirula velayuchunundu seshadriki
Jayamangalam nitya subhamangalam
Jayamangalam nitya subhamangalam